అక్రమ ఇసుక డంప్‌పై బహిరంగ వేలం

అక్రమ ఇసుక డంప్‌పై బహిరంగ వేలం

నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : మండల పరిధిలోని శేరిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్సీ కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సహాయక డైరెక్టర్, మైన్స్ & జియాలజీ మెదక్ ఆదేశాల మేరకు తహసీల్దార్, మండల గిర్దావార్ కలిసి స్థలాన్ని పరిశీలించగా సుమారు 18 ట్రాక్టర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం పంచనామా నిర్వహించి ఆ ఇసుకను ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నారు. ఈ అక్రమ ఇసుక నిల్వలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 2 (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు నార్సింగి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు అదే రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply