అనూష కి అండగా “రఘు”

అనూష కి అండగా “రఘు”

పల్లెనుండి పట్నం దాకా రఘు సేవలు
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్థిక సహాయాలు
నిత్యావసర వస్తువులు, వీల్చైర్లు పంపిణీ
అనూషకు వైద్యం కోసం లక్షా ముప్పై వేలు అందచేత

కురవి, ఆంధ్రప్రభ : మానవుని సాధారణ జీవితంలో ఎవరికి స్వార్ధం వారుచూసుకునే ఈ టెక్నాలజీ రోజుల్లో సాటిమనిషికి సమాజం ద్వారా ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసేవారు చాలా అరుదు దానికి ప్రతిరూపం కొరికి మండల కేంద్రానికి చెందిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ “గంగరబోయిన రఘు” ఇటీవల కాలంలో కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన కొర్ని అనూష రైలు ప్రమాదానికి గురై జీవితం చెల్లాచెదురు అయినా సంగతి విదితమే హైదరాబాద్ లో నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అనూష కి వెన్నుపూస శస్త్ర చికిత్సకి దాదాపు పది లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు గ్రామస్తులు రఘుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యగా స్పందించిన దాతలు ఆర్ధిక సహాయం చేసి అనూష కి అండగా నిలిచారు.అందరూ సహాయం చేసిన మొత్తం రూపాయలను బుధవారం రఘు వారియొక్క కుటుంబ సభ్యులకు అందించాడు రఘును నమ్మి కొట్టిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.బాధితురాలి సోదరుడు ప్రశాంత్,కుటుంబ సభ్యులు రఘుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపి కన్నీటి పర్యం అయినారు.ఈ సందర్బంగా రఘు మాట్లాడారు… మానవత్వనికి మించిన ధర్మం లేదని తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు.

Leave a Reply