విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి

విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మేర గ్రామంలో ఇవ్వాళ విద్యుత్ షాక్ కు గురై మహిళా మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొమ్మేర గ్రామానికి చెందిన మేడగొని జ్యోతి (47) తన ఇంటి ఆరు బయట బట్టలు అరవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతురాలు భర్త గతంలోనే మృతి చెందగా ఉపాధి హామీ కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తుంది.
