అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు..

అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు..
మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ చర్యలను ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకుడు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హామీల అమలుపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల ఉద్యమకారులు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
