వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక…

వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక…
రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : గత ఐదు సంవత్సరాలలో ప్రజలు మౌలిక వసతులు అందక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర గనులు భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నగరంలో చివర ప్రాంతాలకు నీరు అందించేందుకు ప్రత్యేకమైన రెండు వాటర్ ట్యాంకర్లను నగరపాలక సంస్థ నుండి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు నీటి సరఫరా వాహనాలను ఆయన నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యాన్ని గురైన మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం నేడు ప్రత్యేక అధికారి కలెక్టర్ ద్వారా ప్రజల సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
