actress Sunandini | నటి సునంధిని వ్యక్తిగత జీవితం: ఆసక్తికర విషయాలు వెల్లడి

actress Sunandini | నటి సునంధిని వ్యక్తిగత జీవితం: ఆసక్తికర విషయాలు వెల్లడి
actress Sunandini | సీరియల్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన సునంధిని
తన కుటుంబం, కుమారుడి స్పందనపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో ‘అమ్మ’గా మారిన అనుభవం
సహజ నటనతో ముందుకు సాగుతున్న సునంధిని
actress Sunandini | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రోజూ ప్రసారమయ్యే సీరియల్స్‌ను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు, అందులో నటించే కళాకారుల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే కుతూహలం సహజం. ముఖ్యంగా, కొన్ని పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.
అలాంటి ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటీమణుల్లో సునంధిని ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రతి పాత్రలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. చాలా కాలంగా ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నేపథ్యంలో, ఇటీవల ఆమె వ్యక్తిగత విషయాలపై కొన్ని ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రస్తుతం పలు సీరియల్స్, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సునంధిని, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన ఆమె, ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
“నాకు ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నాకు చాలా మంది పిల్లలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. షూటింగ్ సమయంలో కూడా చాలామంది నన్ను ‘అమ్మ’ అని పిలుస్తుంటారు,” అంటూ సునంధిని చెప్పుకొచ్చారు.

ఇక తన సీరియల్స్‌పై తన కుమారుడి స్పందన గురించి మాట్లాడుతూ, “మా అబ్బాయి ముందుగా నా డ్రాబ్యాక్స్ ఏమిటో చెబుతాడు. సీరియల్ బాగుంది అని చెప్పే ముందు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ మెరుగుపరచుకోవాలో సూచనలు ఇస్తాడు,” అని తెలిపారు.
కుటుంబం నుంచి లభిస్తున్న ఈ సహకారం, తన ప్రతిభ—ఇవే తనకు బలంగా నిలుస్తున్నాయని సునంధిని భావిస్తున్నారు. ఈ రెండు బలాలతో ఆమె టెలివిజన్ రంగంలో మరింత ముందుకు సాగుతున్నారు.
సునందిని చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
