చెన్నూరులో మారుమోగిన రామనామం!

చెన్నూరులో మారుమోగిన రామనామం!
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు.పట్టణ వీధులన్నీ “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిపోయాయి. ప్రతి వాడలోనూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తజన సంద్రమైన ఆలయాలు శోభాయాత్ర సందర్భంగా పట్టణంలోని ప్రతాపం మారుతి మరియు బడా హనుమాన్ ఆలయాల వద్ద భక్తులు భారీగా తరలివచ్చారు.
ముఖ్యంగా హనుమాన్ స్వామి మాలధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రకు ప్రత్యేక శోభను చేకూర్చారు. భజనలు, కోలాటాలు, మరియు డప్పు వాయిద్యాల మధ్య యాత్ర కోలాహలంగా సాగింది. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెన్నూరు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా పర్యవేక్షించారు.

