బౌన్సర్ల మధ్య శ్రీరామ కళ్యాణం

బౌన్సర్ల మధ్య శ్రీరామ కళ్యాణం

  • ఓరుగల్లులో విచిత్రం…
  • పాత, కొత్త కమిటీల మధ్య ఆధిపత్య పోరు
  • కోర్టు ఉత్తర్వులు బేఖాతరు
  • షూస్ తోనే బౌన్సర్స్ డ్యూటీ
  • భక్తుల ఆగ్రహం…

వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ ; ఓరుగల్లు నగరంలో శ్రీ రామ కళ్యాణమహోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్త,పాత కమిటీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో ఇప్పటి వరకు ఎక్కడ జరుగని ఆసక్తికర సంఘటన వరంగల్ నగరంలోని కాశిబుగ్గ రామాలయంలో చోటుచేసుకుంది. పాత కమిటీ వారు హై కోర్టును ఆశ్రయించి, ఈ ఏడాది వారే శ్రీ రాములోరి కళ్యాణం చేసే విధంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ.. కొత్తగా ఎన్నికైన కమిటీ హై కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, శ్రీ రామ కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఇందుకై బౌన్సలర్లను నియమించుకొని కళ్యాణ వేదిక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.సదరు బౌన్సర్లు కళ్యాణ మండపంలోనే కాళ్లకు షూస్ వేసుకొని విధులు నిర్వర్తించడం కూడా వివాహదాస్పదంగా మారింది. శ్రీ రాముడి కల్యాణాన్ని కనుల్లారా వీక్షించడానికి వచ్చిన భక్తజనం బౌన్సలర్ల తీరుపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు.

వరంగల్ కాశీబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.కొత్త కమిటీ వారు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బౌన్సర్లను ఏర్పాటు చేసి కళ్యాణం కొనసాగించడం హాట్ టాఫిక్ గా మారింది. ఇదేమి విచిత్రం అంటు భక్తులు ముక్కున వేలాసుకొన్నారు. స్వామి వారి పెళ్లికి బౌన్సర్ల అవసరం ఏంటి అంటు చర్చించుకున్నారు.

Leave a Reply