13 Dead Bus Lorry Crash : 13 మంది అక్కడిక్కడే బుగ్గి Andhra Prabha Latest News
13 Dead Bus Lorry Crash : 13 మంది అక్కడిక్కడే బుగ్గి Andhra Prabha Latest News
- రాయవరంలో ఘోరం
- ట్రిప్పర్.. ప్రైవేటు బస్సు ఢీ
- మరో 20 మందికి గాయాలు
- మార్కాపురం ఆసుపత్రికి తరలింపు
( ఆంధ్రప్రభ, మార్కాపురం బ్యూరో )

13 Dead Bus Lorry Crash : మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో (మార్చి 26, 2026) గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పప13 మంది సజీవదహనం అయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు, హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా పొదిలి వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం వద్ద పలకల క్వారీల సమీపంలో ఎదురుగా వస్తున్న కంకర లారీని అత్యంత వేగంతో ఢీకొట్టింది.
13 Dead Bus Lorry Crash 13 మంది సజీవ దహనం

బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 మందికి గా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తక్షణమే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద స్థలికి వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఢీకొన్న ధాటికి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వేగంగా వ్యాపించాయని, ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రాథమిక సమాచారం.
13 Dead Bus Lorry Crash మృతులందరూ.. కూలీనాలీ జనమే

తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భవన నిర్మాణ కార్మికులుగా మార్కాపురం , నెల్లూరు జిల్లాల నుంచి వలస కూలీలుగా వెళ్లిన.. బేల్దారీ కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో మృతులో అత్యధికులు బేల్దారీ కూలీలే ఉన్నారు.

తన బిడ్డతో సహా యువదంపతులు దుర్మరణం చెందారు. ఓ చేతికి అందిన కొడుకు, కూతురు సహా ఓ తల్లి మృతి చెందింది. కనిగిరి మండలం పల్లిపల్లె గ్రామానికి చెందిన సంభాలపాటి అయ్యన్న (18 ) నెల్లూరు జిల్లా ఇంజమూరు కు చెందిన చేబేటి మనోజ్‌కుమార్ (18) చేంబుటి సుజాత (45), చేంబేటి మేఘన (19),

వెలుగోడు గురవయ్య (60). చింతగుంట్ల గ్రామానికి చెందిన ఆర్ ప్రకాష్ ( 21) చౌడవరం గ్రామానికి చెందిన పుట్లూరి మహేంద్ర రెడ్డి , దారి కట్లకు చెందిన అంబటి సౌజన్య ( 22) , వింజమూరు మండలం నల్లగండ్ల గ్రామానికి చెందిన సలపల సురేంద్ర ( 25) ,సలపల చందన ( 21) సలపల చందు( 6), ఉదయగిరి విజ్జంపల్లి గ్రామానికి చెందిన పోసిన ప్రకాష్ (17)
13 Dead Bus Lorry Crash క్షతగాత్రుల వివరాలు

యూ మపోకహర్ 20. (కనిగిరి మండలం లింగారెడ్డి పల్లి) , బండారు లోహన్ 60, ( పామూరు) , అద్దంకి మనోహర్ 23 ( పామూరు), డప్పుకొట్టు కిరణ్ 24, (ఉదయగిరి మండలం ,దాసరపల్లి), మత్తెం యువరాజు 23, (కనిగిరి మండలం కొండాపురం,). కోలా బెంజిమిన్, మైలారు చిట్టిబాబు 28, నూనె జాన్ 33 (గుంటుపల్లి . పీసీ పల్లి,) బత్తుల ఆదమ్మ 32, (అంకబోపాలపురం), డప్పుకొట్టు శ్రీహరి, కుమ్మర కొండ 17, చౌడవరం వెలిగండ్ల గ్రామానికి చెందిన అబ్రాహం 49 గాయపడ్డారు.
13 Dead Bus Lorry Crash ఏడుగురు గల్లంతు

ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణించిన 7గురు జాడ తెలియలేదు. వీరి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ్మిశెట్టి తిరుపాలు, అనిల్, డే కొడాక్, హోహాన్, బండార పద్మ, పిచ్చయ్య , తనూజ.
13 Dead Bus Lorry Crash సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
13 Dead Bus Lorry Crash మంత్రులు దిగ్బ్రాంతి
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్గ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం పై మంత్రులు తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ నుభూతి తెలిపారు. పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఘటనాస్థలిలో బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులు సూచించారు. క్షతగాత్రులకు ఉన్నత వైద్యం అందించాలని, వైద్య నిపుణులను పంపించాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు.
