మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ పురపాలక సంఘం రెండవ కౌన్సిల్ మొట్టమొదటి సమావేశం బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. పట్టణాభివృద్ధియే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ, సహకారాలతో చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలకు అతీతంగా ప్రతి వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి కౌన్సిలర్‌కు నా పూర్తి సహకారం ఉంటుంది. అదే విధంగా కౌన్సిలర్లందరూ పట్టణ అభివృద్ధి కోసం నాకు పూర్తిగా సహకరించాలని ఆమె కోరారు. చైర్ పర్సన్ స్వయంగా ఎజెండాలోని ప్రతి అంశాన్ని చదివి సభ్యులకు వినిపించారు. ప్రతి అంశంపై కౌన్సిలర్లతో చర్చించి, అవసరమైన చోట మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరారు. ఎజెండాలోని అంశాలపై లోతైన అవగాహన చేసుకున్న అనంతరం, కొన్ని అంశాలను సవరించాల్సిందిగా కమిషనర్ కు సూచించారు, మరికొన్ని ముఖ్యమైన ప్రజాహిత నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధియే ప్రధాన ఎజెండా అని, అందరినీ సమానంగా చూస్తానని, అభివృద్ధిలో అన్ని వార్డులకు ప్రాధాన్య ఇస్తానని తెలిపారు. వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ ఇది మొట్టమొదటి సమావేషమే కానీ సమస్యలు కొత్తవి కావని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ సాధారణ సమావేశం నందు కౌన్సిల్ సభ్యులందరూ (అన్ని వార్డుల కౌన్సిలర్లు) పాల్గొని పట్టణ అభివృద్ధికై మేమంతా ముందుంటామని తెలిపారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు (ఆర్ అండ్ బి నవీన్, మెడికల్_ కాటమరాజు, అగ్రికల్చర్_ ముత్యాల నాగరాజు) మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply