డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు

డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు

ట్రాఫిక్ పోలీసుల మానవీయ కోణం…
సిగ్నల్ వద్ద చల్లని గ్రీన్ మ్యాట్ పందిరి ఏర్పాట్లు..
ఎండలో నిలిచే వారికి ఉపశమన చర్యలు…
ట్రాఫిక్ పోలీసుల ప్రశంసిస్తున్న వాహనదారులు..

విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సిగ్నల్ వద్ద నిలిచే వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు ఆరవ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గౌరవనీయులైన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ఆదేశాలపై అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డాబా కొట్లు సెంటర్ వద్ద గ్రీన్ మ్యాట్ షెడ్ ఏర్పాటు చేశారు.

సిగ్నల్ వద్ద వాహనదారులు ఎండలో ఎక్కువసేపు నిలబడే పరిస్థితి ఉండటంతో, వారికి చల్లని నీడ అందించాలనే ఉద్దేశంతో ఈ షెడ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో తీవ్ర ఎండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్య ఉపశమనంగా మారింది.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సువర్ణ రాజు, ఎస్ఐలు జే. కృష్ణ, నాగదుర్గతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. డ్యూటీకి మించి ప్రజల సమస్యలను గుర్తించి స్పందించిన పోలీసుల ఈ చర్యను స్థానికులు అభినందిస్తున్నారు.