జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సన్మానం

జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సన్మానం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని సోమేశ్వర రైతు సంఘం కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటరమణారెడ్డి మంగళవారం సందర్శించారు. సంఘ బాధ్యులు ఈ సందర్భంగా జిల్లా అధికారిని తమ సంఘం పక్షాన సన్మానించారు. మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్, సోమేశ్వర రైతు సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
