ఫోటో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం…

ఫోటో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం…

ఏపీపీజేఏ 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : సమాజంలోని వాస్తవ సంఘటనలను చిత్రాల రూపంలో ప్రతిబింబిస్తూ వార్తలకు జీవం పోసే ఫోటో జర్నలిస్టుల సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతి ఫోటో వెనుక ఒక యథార్థ కథ దాగి ఉంటుందని తెలిపారు.

సమాజంలో చోటుచేసుకునే సంఘటనలను క్షణాల్లో బంధించి ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, సామాజిక సంఘటనలు వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి నిబద్ధతతో పనిచేయడం వారి గొప్పతనమని కొనియాడారు.

ఏపీపీజేఏ ప్రతి సంవత్సరం చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించడమే కాకుండా, వృత్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదపడుతున్నాయని ప్రశంసించారు. ఫోటో జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీజేఏ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు తమ సంస్థ కార్యకలాపాలు, జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్ డా. జి. లక్ష్మీశను ఘనంగా సత్కరించారు.

Leave a Reply