నంద్యాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు…

నంద్యాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు…

అదునాతన శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో..
ఎన్ టీ ఆర్ ఆరోగ్యశ్రీ సేవలతో ఉచిత వైద్య సేవ లు…
ఎం డి.. మారుతి కుమార్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్ టీ ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో ఉచిత వైద్య సేవలను ఈ హెచ్ ఎస్ పథకం ద్వారా ఉద్యోగులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆధునిక వైద్య సేవలు కనుగుణంగానూతన శస్త్ర చికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయని సెవెన్ హిల్స్ ఎం. డి.రెంటాల మారుతి కుమార్ పేర్కొన్నారు. సోమవారం దశ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో అధునాతన శస్త్ర చికిత్స నూతన పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మారుతి కుమార్ మాట్లాడుతూ 5వేలకు పైగా ట్రామా కేసులు చేశామన్నారు. 300కు పైగా మోకాలి చిప్ప శస్త్ర చికిత్స మార్పిడి ఆరోగ్యశ్రీ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులకు వైద్య సేవలు అందుబాటులోకి చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సందీప్, మేనేజింగ్ పార్టనర్ డాక్టర్ దస్తగిరి పర్ల, సిబ్బంది పాల్గొన్నారు.

సెవెన్ హిల్స్ ఆస్పత్రిని గత పది సంవత్సరాలుగా ఆదరిస్తున్న పట్టణ ప్రజలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజలు మారుమూల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో రాజశేఖర్, మధు, పార్వతమ్మ తదితరులను ఆయన ఘనంగా సత్కరించారు.

Leave a Reply