త్యాగానికి నిలువుటద్దం.. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
త్యాగానికి నిలువుటద్దం.. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం బాపట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కొత్త మాసు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, మాజీ మంత్రి ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధ రాఘవరావు, మాజీ అధ్యక్షులు ఎల్లంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ ఆఫీస్ వద్ద గల జివిసి రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠ సభా వేదిక వద్దకు చేరుకొని ఎమ్మెల్యే వేగేశన, మాజీ మంత్రి సిద్ధ రాఘవయ్య, బాపట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త మా సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ అమర జీవి ఆత్మ త్యాగం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన త్యాగం నిలువుటద్దమని, అయన ఆశయాలను గౌరవిస్తూ విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు అని తెలియజేశారు.
పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అతిధులు పుష్పాంజలి ఘటించారు. బాపట్ల పట్టణ తెదేపా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బాపట్ల ప్రముఖులు, పొట్టి శ్రీరాములు అభిమానులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
