కడెంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్..

కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాల అమలు చెయ్యాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడి నేపధ్యంలో ముందస్తు కడెం పోలీసులు బిజెపి నేతలను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
బిజెపి కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయగా కడం పోలీసులు బిజెపి మండల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తగదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు.
అరెస్ట్ అయినవారిలో బిజెపి కడెం మండల అధ్యక్షుడు కాశ వేణి శ్రీనివాస్ యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు జక్కుల సత్తన్న ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్ మండల నాయకులు గడప దేవరాజ్ గట్ల నల్లగొండ ములికి కృష్ణ బి.రమేష్ తదితరులు ఉన్నారు.
