33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు..

33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు..
ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : ఉమ్మడి మండలాల పరిధిలోని మామకన్ను సబ్ స్టేషన్లో 33 కెవి వోల్టేజ్ బూస్టర్ ను విజయవంతంగా అమర్చడం జరిగిందని సూపరిడెండెంట్ ఇంజనీర్ జి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం 6 యూనిట్ల 33 కేవీ వోల్టేజ్ బూస్టర్లను అమర్చడం జరిగిందని వీటితో వోల్టేజ్ స్థాయి ఎంతగానో మెరుగుపడిందని పేర్కొన్నారు. ఈహెచ్‌టీ ఇల్లందు నియోజకవర్గం నుండి సరఫరా అయ్యే రేడియల్ 33 కేవీ మామకన్ను ఫీడర్ ల పై భారాన్ని తగ్గించడం ద్వారా ఈ విద్యుత్ లైన్ మొత్తం పొడవు 78.5 సర్క్యూట్ కిలోమీటర్లు గుండాల, మామకన్ను, ఆళ్లపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని పలు పంచాయతీల్లోని ఆయా గ్రామాలకు మెరుగైన వోల్టేజ్ సరఫరా సకాలంలో అందుతుందన్నారు.
ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని మామకన్ను పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింతగా మెరుగుపడిందని విద్యుత్ సరఫరా స్థాయిని పెంచేందుకు ఎంతో దోహదపడుతుందని మహేందర్, నజీర్ లు వివరించారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల మక్కువ చూపుతూనే రాష్ట్ర స్థాయి కాకుండా దేశ వ్యాప్తంగా పట్టెడన్నంపెట్టే రైతుల కోసం విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా 24 గంటలు కోతలు లేకుండా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దీని వలన రైతులకు కలిగే ప్రయోజనం ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. ఆ దిశగా రైతులు సైతం విద్యుత్ సౌకర్యాన్ని సకాలం సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు ఆకాంక్షించారు. ఎలాంటి మరమ్మత్తులు గురైన వెంటనే విద్యుత్ సిబ్బందికి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
