ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దు……

ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దు……

కడెం, ఆంధ్రప్రభ : ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని కడెం మండలంలోని బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ డాక్టర్ భూమన్న యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ డిపిఆర్ఓ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు తిరునగిరి సుధాకర్ ఆధ్వర్యంలో కడెం మండలంలోని బెల్లాల్ నర్సింగాపూర్ గ్రామాల్లో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, గంజాయి, డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్మూలన, సీసీ కెమెరాలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమ్స్, హెల్మెట్, పచ్చదనం పరిశుభ్రత, ఆరోగ్యం ,విద్యా వికాసం చట్టాల పైన మ్యూజిక్ మిమిక్రీ మాట్లాడే బొమ్మ ద్వారా గ్రామాల ప్రజలకు కళాజాత ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఈ కళాజాత ప్రదర్శనకు సీనియర్ కళాకారుడు నల్ల రాంరెడ్డి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మద్దిపడగ బెల్లాల్ ఉప సర్పంచ్ అల్తాటి అనూష శ్రీనివాస్, జిపి వార్డు సభ్యులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.