యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి

యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి

దర్శి, ఆంధ్రప్రభ : యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి (ఎవిఎస్) 25 వ వర్ధంతి సందర్భంగా దర్శి యుటిఎఫ్ పక్షాన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ నిజాయితీ,నిబద్ధత, నిరాడంబరత, త్యాగశీలతతో పాతికేళ్ళపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తదుపరి ఐక్య ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులుగా చివరి శ్వాస వరకూ ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు కామ్రేడ్ ఎవిఎస్ అని వారి జీవితం స్పూర్తిదాయకమని,నేటితరం నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శనీయమని కొనియాడారు.


జిల్లా కార్యదర్శి మీనిగ శ్రీను మాట్లాడుతూ.. మార్చి 24 వ తేదీన జరిగే నిరహార దీక్షలను ఘనంగా నిర్వహించి ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని తెలియజేశారు. యూటీఎఫ్ కార్యకర్త ఎప్పుడూ సంఘం యొక్క నిబంధనావళి మేరకు అడుగులు వేయాలని సంఘం ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటించాలని తెలియ జేశారు.

ఈ కార్యక్రమం లో ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజయ్ కుమార్,దర్శి మండల అధ్యక్షులు కె శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి రామారావు , ముండ్లమూరు ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి , కురిచేడు మండల కోశాధికారి మణికుమార్, మండల సహాధ్యక్షులు ఏడుకొండలు ,కోశాధికారి రవి కుమార్,జిల్లా కాన్సిలర్ అట్లూరి రామారావు, దొనకొండ మండల బాధ్యులు, వెంకటరెడ్డి, మండల కార్యదర్శులు పి ఆదిశేషయ్య ,టీ రవిచంద్ర, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply