పుతిన్ అమెరికాకు షరతు..

పుతిన్ అమెరికాకు షరతు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు నిలిపివేస్తేనే ఇరాన్‌కు నిఘా సమాచారం అందించడం ఆపేస్తామని పుతిన్ వైట్ హౌస్‌కు షరతు పెట్టారు. ప్రస్తుతం పుతిన్ చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ యుద్ధంలో ఇరాన్‌పై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఇరాన్ పై యుద్ధం ఆపే ప్రసక్తి లేదని డొనాల్డ్ స్పష్టం చేశారు. అయితే రష్యా చేసిన ప్రకటనపై అమెరికా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
