Israel | గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట….

Israel | గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట….

Israel | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై కూడా పడుతోంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి కొరత నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ గ్యాస్ కేటాయింపులపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20 శాతం గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

Israel |

Israel | వివిధ రంగాలకు కొంత మేర ఉపశమనం

ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు అందే మొత్తం గ్యాస్ సరఫరా, ప్రస్తుత సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 50శాతానికి చేరుకుంటుందని తెలిపారు. దీంతో ప్రజలకు, వివిధ రంగాలకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, అదనంగా కేటాయించిన గ్యాస్ వినియోగంలో కేంద్రం కొన్ని ప్రాధాన్యతలను కూడా నిర్దేశించింది. సామాన్యుల ఆహార అవసరాలు దెబ్బతినకుండా ఉండేందుకు రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Israel |

CLICK HER TO READ MORE : Pezheshkian | మారుతున్న పరిస్థితులపై చర్చ

CLICK HER TO READ MORE

Leave a Reply