Pezheshkian | మారుతున్న పరిస్థితులపై చర్చ

Pezheshkian | మారుతున్న పరిస్థితులపై చర్చ
Pezheshkian | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతదేశం కీలక దౌత్య చర్యలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని స్థాయిలో జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈద్, నౌరూజ్ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు. ఆ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ, నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు.

అంతర్జాతీయ నౌకా మార్గాలు నిరంతరం తెరిచి ఉండాలని సూచించారు. ఇక ఇరాన్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. ఈ సంభాషణ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా సాగినట్లు భావిస్తున్నారు.
