ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ ; నాగర్కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అయిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ,వైస్ చైర్మన్ బాదం రమేష్ ,కౌన్సిలర్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
