సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత..

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత..
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజక వర్గానికి చెందిన ముగ్గురికి సీఎం ఆర్ ఎఫ్ లేఖలు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారు.నగరంలోని 39 వ డివిజన్ కి చెందిన బుద్దా సుబ్రమణ్యం గుండె కు సంబంధించిన బైపాస్ సర్జరీ కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు.ఆయన సర్జరీ కు అవసరమైన 5,00,000/-. రూపాయల సహాయం కోరుతూ ఎల్వోసీ లేఖను ఎమ్మెల్యే సుజనా చౌదరి రాసారు.
అదే డివిజన్ కు చెందిన డూపగుంట్ల సువర్ణ. యూట్రస్ సర్జరీ. 2,50,000/ రూపాయలు,అదే విధంగా 54 వ డివిజన్ కి చెందిన పఠాన్ సోహైల్ ఖాన్ కు తలకు తీవ్ర గాయం కావడంతో బ్రెయిన్ సర్జరీ కోసం అవసరమైన 9,56,000/- రూపాయల ఆర్థిక సాయం కోరుతూ సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖలు రాసారు.వీరికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే సుజనా కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు.
కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ 40డివిజన్ ప్రెసిడెంట్ పునుగుపాటి సుబ్బయ్య ,39డివిజన్ జనసేన ప్రెసిడెంట్ ఏలూరు సాయి శరత్, 50 డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ కొప్పుల గంగాధర్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
