CHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

CHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

​ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో మెరుపు పర్యటన చేశారు.

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC), డయాలసిస్ సెంటర్‌ను సందర్శించి, వైద్య సేవల నాణ్యతను స్వయంగా పరిశీలించారు.