బసంత్ నగర్ విద్యుత్ ఏఈపై చర్యలు తీసుకోవాలి..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : టీజీ ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిది బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. స్వామి డిమాండ్ చేశారు.

విద్యుత్ సబ్ స్టేషన్లలో పని చేస్తున్న ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరిస్తున్నారని ఏఈ ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపి శాఖా పరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ లో గల ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు, యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు.

ఆపరేటర్లను కక్ష్య పూరితంగా వేధిస్తున్నారని ఎస్ఈ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఏఈ తీరుతో సబ్ స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు భయాందోళన చెందుతున్నారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో మద్యం మత్తులో ఏఈ సబ్ స్టేషన్ లను సందర్శించి ఆపరేటర్లను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఏఈ వైఖరిపై తక్షణమే విచారణ జరిపి ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీ ఎన్పీడిసిఎల్ కంపెనీ ప్రెసిడెంట్ జి.ఆంజనేయులు, రీజనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాగు నాయక్, సిహెచ్ నర్సయ్య, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండయ్య, కె.నరేష్, పెద్దపల్లి సర్కిల్ గౌరవ అధ్యక్షులు భిక్షపతి, మంథని డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్, సర్కిల్ పరిధిలోని ఆపరేటర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply