Differences | సర్‌ప్రైజ్‌ ఇస్తామని…

Differences | సర్‌ప్రైజ్‌ ఇస్తామని…

Differences | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక సైనికాధికారి, ఐఆర్‌జీసీ ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్‌ నయినీ మృతి చెందినట్లు సమాచారం. శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హంగా మారింది.

దాడులకు ముందు నయినీ మాట్లాడుతూ… యుద్ధ పరిస్థితుల మధ్య కూడా ఇరాన్‌లో క్షిపణి ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. మిసైల్‌ పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని పేర్కొంటూ, ఇజ్రాయెల్‌కు త్వరలోనే సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరించారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోపే ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.