IPL | 2008 లో ఎంట్రీ ..

IPL | 2008 లో ఎంట్రీ ..
IPL | ఐపీఎల్ 2008 నుంచి కొనసాగుతున్న అరుదైన ఆటగాళ్లు
కోహ్లీ అరుదైన రికార్డు.. ఒకే జట్టుకు నిబద్ధత
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై విజయగాథ
కెప్టెన్ కూల్ ధోనీ ప్రభావం
మనీశ్ పాండే ప్రత్యేక గుర్తింపు
ఐపీఎల్ చరిత్రలో ఈ నలుగురి స్థానం
IPL | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో మార్పులు, ఎంతో మంది ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు వచ్చారు వెళ్లారు, ఎంతో మంది రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆటగాళ్లు చాలా అరుదు. అందులోనూ వారు భారత ఆటగాళ్లు కావడం విశేషం, ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు కెప్టెన్‌గా (Captain) వ్యవహరించారు. మొదటి సీజన్ ప్రారంభమైనప్పుడు యువ ఆటగాళ్లుగా రంగప్రవేశం చేసిన వీరు, ఇప్పుడు లీగ్‌కు ఐకాన్‌లుగా మారిపోయారు. కాలం మారినా, ఫార్మాట్ మారినా, పోటీ పెరిగినా.. వీరి స్థానం మాత్రం అలాగే నిలిచింది. వారే భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే విధ్వంస బ్యాటర్ మనీశ్ పాండే. వీరితో పాటు రహానే, రవీంద్ర జడేజా కూడా ఆడుతున్నారు, కానీ 2010లో ఒక్క సీజన్ ఆడలేదు.

కోహ్లీ కానీ కోహ్లీ (Kohli) ఒక్కరే ఒకే జట్టు తరఫున 19 సీజన్లు ఆడి అరుదైన ఘనత సాధించారు. మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ, జట్టుకు నిబద్ధత అంటే ఏమిటో చూపించాడు. అతని క్రీడా పటిమ, ఫిట్‌నెస్, కన్సిస్టెన్సీ యువతకు ఆదర్శంగా కోహ్లీ నిలుస్తున్నారు.
రోహిత్ శర్మ కూడా 2008 నుంచే IPLలో భాగమయ్యాడు. ప్రారంభంలో ఇతర జట్లకు ఆడినా, తర్వాత ముంబాయి ఇండియన్స్ జట్టుతో కలిసి తన కెరీర్‌ను (Career) మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. అతని బ్యాటింగ్ స్టైల్, మ్యాచ్‌ను మార్చే సామర్థ్యం ప్రత్యేకం. తన సారథ్యంలో ముంబాయికి 5 కప్‌లు అందించారు.

ఇక కెప్టెన్ కూల్ ఎమ్.ఎస్. ధోనీ ఐపీఎల్ (IPL) ప్రారంభం నుంచే విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మొదట్లో ఇతర జట్టులో ఆడినా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో అతని బంధం ఎంతో ప్రత్యేకం. అతని ఫినిషింగ్ టచ్ మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ధోనీ సారథ్యంలో ఇతర జట్ల కంటే చెన్నైకి ఎంతో మంది అభిమానులు సొంతం అయ్యారు.
మనీశ్ పాండే కూడా 2008 నుంచే IPLలో అడుగుపెట్టాడు. పలు జట్లకు ఆడుతూ, ముఖ్యమైన మ్యాచ్‌లలో తన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలను అందించాడు. IPLలో తొలి భారత శతకం సాధించిన ఆటగాడిగా కూడా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

