AP CM | చంద్రబాబు పై రోజా విమర్శలు

AP CM | చంద్రబాబు పై రోజా విమర్శలు

AP CM | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి పై విరుచుకుపడుతూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలతో ముందుకు వచ్చారు.

సీఎం నారా చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగ నాడు కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, సీఎం అయ్యాక సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు.

జగనన్న పాలనలో పేదవాళ్లు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని, కానీ చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ పేరుతో మోసం చేశారని రోజా ఆరోపించారు.

Leave a Reply