విద్యార్థులే ఉపాధ్యాయులై ఆలరించిన వేళ…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని గీతాంజలి గ్రామర్ పాఠశాలలో శుక్రవారం వివిధ వేషాధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు నేర్పి స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలుఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల బోధన తీరును పరిశీలించిఅభినందించారు.
తమతో చదువుకున్న విద్యార్థులకు ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించి చక్కని ప్రతిభ కనబరచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు విద్యార్థులను అభినందించి సన్మానించారు. కలెక్టర్ గా భాషిణి, డీఈవో గా అతిష, హెచ్ఎం గారిషిత తో పాటు పలువురు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై. అవినాష్, హెచ్ఎం నాగవేణి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
