పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం..

పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం..

ఈ నెల 22 వ తేదిన బాలమేళా వార్షికోత్సవం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారుల ఉన్న తొలగించి బాలలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది భరతమాత సేవలు పాలుపంచుకునే విధంగా వారిని తీర్చిదిద్దడం సంఘమిత్ర ప్రధాన లక్ష్యమని అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మహేశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కర్నాటి నాగ సుబ్బారెడ్డి లు పేర్కొన్నారు. శుక్రవారం సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో బాలమేళా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతూ ఉపేక్షిత బస్తీలలో నివసించే పిల్లలను, మంచి పౌరులుగా తీర్చిదిద్ది, భరతమాత సేవలో పాల్గొని విధంగా చేయాలన్న సంకల్పంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు. అందులో భాగంగా ఈనెల 22వ తేదీ వైయస్సార్ కళ్యాణ మండపం ప్రథమనందిలో మా అభ్యాసికల బాలమేళా వార్షికోత్సవం జరుగునన్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలతో, అండదండలతో, ఆదరాభిమానాలతో అభిమానిస్తున్న దాతలకు, శ్రేయోభిలాషులకు ఇవే మా సంఘమిత్ర కార్యవర్గ సహృదయంగా ఆహ్వానిస్తున్నమన్నారు.

సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రీత బాలల ఆవాసము ఉచిత విద్యా గృహం చెంచుల కోసం ఐఎంఏ డాక్టర్స్ మహిళా విభాగం సహాయ సహకారాలతో సంచార వైద్యశాల, పర్యావరణ సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ వాడడం నిరోధించడంలో భాగంగా, “పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత” భాగంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉపేక్షిత బస్తీలలో అభ్యాసి గల పేరుతో విద్యా, వైద్యం, ఆరోగ్య అవగాహన, సంస్కృతి, సాంప్రదాయాల మీద ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నమన్నారు.

కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలోసహ కార్యదర్శి కరణం సుందర రావు సంఘటన కార్యదర్శి సిరిగిరి జయశ్రీ సభ్యులు డివి అశోక్ కుమార్, వెంకటేశ్వరమ్మ, వెంకట రమణయ్య, రామాంజనేయులు ప్రచార ప్రము ఖ చింతలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.