ఘనంగా ఉగాది సమాపనోత్సవం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ద్వారకా నగర్ లో పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాల సమాపనోత్సవం శుక్రవారం భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నూతన పంచాంగ ఫలితాలను గమనించి ఆలోచనాత్మకంగా ప్రజలు కొత్త ఏడాదిలో ఆనందోత్సాహాలతో ముందుకు సాగాలని యూత్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు సీస శివ, లక్కాకుల సంతోష్,కిరణ్, బరిగే వెంకటేష్,సాయి, నాగరాజు, భాను,క్రాంతి,రాజు, మహేష్ శ్రావణ్,రాకేష్, ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ అధ్యక్షులు బరిగే శ్రీనివాస్ పాల్గొన్నారు.
