Budget Meetings | పాము కలకలం
Budget Meetings | పాము కలకలం
Budget Meetings | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ఆవరణలో ఓ ఘటన చోటుచేసుకుంది. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో పాము కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పాత శాసనమండలి ఆవరణలో పాము సంచరిస్తుండటం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనను గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా స్పందించి, పామును సురక్షితంగా పట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.
