₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha Detail Report

₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha Detail Report
- ఒకే ఒక్క క్షిపణితో.. ప్రపంచం షాక్
- రాస్ లఫాన్ ప్లాంట్ ధ్వంసం..
- ఇక గ్యాస్ సంక్షోభం షురూ
- ప్రపంచ మార్కెట్లు బేర్
- ₹250 లక్షల కోట్ల సంపద ఆవిరి
- భారత్‌కూ భారీ దెబ్బ
( ఆంధ్రప్రభ, దోహ ప్రతినిధి)

ఇజ్రాయెల్, అమెరికా జంట తమ కీలక అగ్రనేతల్ని మట్టుబెట్టటంతో్.. ఇరాన్ రలిగిపోయింది. ప్రతీకారంతో రెచ్చిపోయింది. ముగ్గురు కీలక నేతల్ని చంపేశామని ఇజ్రాయెల్ ప్రకటనతో.. అమెరికాకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఖతార్‌పై ఇరాన్ గురి పెట్టింది. ఖతార్ ఆర్థిక ఆయువు పట్టు రాస్ లఫాన్ (Ras Laffan) లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ప్లాంట్ ఇండస్ట్రియల్ సిటీపబాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 గంటల మధ్య తన భూభాగం నుంచి ఖతార్‌పైకి బాలిస్టిక్ క్షిపణులు (Ballistic Missiles) డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. అప్పటికీ ఖతార్ వైమానిక దళం కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, ఒకే ఒక క్షిపణి ప్రధాన లక్ష్యాన్ని ఢీకొంది. .
₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం

ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ప్లాంట్ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడితో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని ‘పర్ల్ గ్యాస్ – టు – లిక్విడ్స్’ (Pearl GTL) యూనిట్ తో పాటు ఎల్‌ఎన్‌జి యూనిట్లకు తీవ్ర నష్టం (Extensive Damage) వాటిల్లింది. ఈ విషయాన్ని ఖతార్ ఎనర్జీ సంస్థ ధృవీకరించింది. ఇరాన్ ప్రయోగించిన ఖండాంతర క్షిపణుల్లో.. గురి తప్పని ఒకే ఒక్క క్షిపణి కేవలం ఖతార్ ఆయువు పట్టునే కాదు. యావత్ ప్రపంచాన్ని కుఅఅదిపేసింది. ఎల్‌ఎన్‌జి (LNG) మార్కెట్ లో ఖతార్ వార్షిక ఎగుమతి అంచనా విలువ సుమారు $120–$140 బిలియన్ డాలర్లు (దాదాపు ₹10 లక్షల కోట్ల నుంచి ₹11.6 లక్షల కోట్లు . 2025లో ఖతార్ సుమారు 81.07 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జిని ఎగుమతి చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.1% పెరిగింది. ఖతార్ ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో హైడ్రోకార్బన్ (చమురు మరియు గ్యాస్) రంగం వాటా సుమారు 83% గా ఉంది. 2023లో ఖతార్ సుమారు $85 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.
₹ 250 Triliion Vapors : 5 ఏళ్లు ఉత్పత్తి లేనట్టే..

ప్రపంచ ఎల్‌ఎన్‌జి సరఫరాలో ఖతార్ వాటా సుమారు 18.8% నుంచి 19% వరకు ఉంది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ఎగుమతి దేశంగా ఖతార్ నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ఎగుమతి కేంద్రం రాస్ లఫాన్‌లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు, ఈ దాడులతో ఖతార్ మొత్తం ఎల్‌ఎన్‌జి ఎగుమతి సామర్థ్యంలో 17% (సుమారు 12.8 మిలియన్ టన్నులు) తుడిచిపెట్టుకుపోయింది. ఈ నష్టాన్ని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్-కాబీ దృవీకరించారు. దెబ్బతిన్న ప్లాంట్ల పునరుద్ధరణకు 3 నుంచి 5 ఏళ్ల సమయం అవసరం. సుమారు $26 బిలియన్ డాలర్ల ( ₹ 2,42,296 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. ఫోర్స్ మెజ్యూర్ (Force Majeure) అనివార్య కారణాలతో గ్యాస్ సరఫరా చేయలేమని ఖతార్ ఎనర్జీ అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు ఎల్‌ఎన్‌జి సరఫరాలో భారీ అంతరాయం తప్పటం లేదు. భారత్ తన ఎల్‌ఎన్‌జి అవసరాల్లో 40-50% ఖతార్ నుండే దిగుమతి చేసుకుంటుంది. రాస్ లఫాన్ ఉత్పత్తి నిలిచిపోవటంతో.. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి (Petronet LNG) కంపెనీలు తమ సరఫరాలో 40% వరకు కోత విధించాయి.
₹ 250 Triliion Vapors : ప్రపంచ దేశాలు బేర్…

గ్యాస్ ఎగుమతిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచిన ఖతార్‌పై ఇరాన్ దాడి చేయటమే కాదు.. అతి పెద్ద లిక్విడ్ గ్యాస్ కంపెనీ రాస్ లఫాన్‌ను ధ్వంసం చేయటంతో.. ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. భారత్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,497 పాయింట్లు (3.26%) పడిపోయి 74,207 వద్ద ముగియగా, నిఫ్టీ 50 దాదాపు 776 పాయింట్లు నష్టపోయి 23,002 వద్ద స్థిరపడింది. అమెరికా డౌ జోన్స్ (Dow Jones) 1.6% పడిపోయి 2026లో కనిష్ట స్థాయికి చేరగా, S&P 500 1.36%, నాస్డాక్ (Nasdaq) 1.46% మేర నష్టపోయాయి. జపాన్ నిక్కీ (Nikkei) 3.4%, దక్షిణ కొరియా కోస్పి (KOSPI) 2.7%, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ (Hang Seng) 2% మేర పతనమయ్యాయి. పాన్-యూరోపియన్ స్టాక్స్ (Stoxx 600) 1.8% మేర క్షీణించాయి.
₹ 250 Triliion Vapors : 250 లక్షల కోట్లు ఆవిరి

ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై ఇరాన్ దాడితో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా (Global Market Cap): అంతర్జాతీయ మార్కెట్లలో మదుపుదారుల సంపద దాదాపు $ 2.5 ట్రిలియన్ల నుంచి $3 ట్రిలియన్ల వరకు (సుమారు ₹210 లక్షల కోట్ల నుంచి ₹250 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినట్లు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్లలో (BSE & NSE) కేవలం ఒక్క రోజులోనే దాదాపు ₹11 లక్షల కోట్ల నుండి ₹13 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్ని, ఫ్టీలు తమ 52 వారాల గరిష్ట స్థాయిల నుండి సుమారు 3% నుంచి 4% మేర పడిపోయాయి. ఏవియేషన్ (విమానయానం), పెయింట్స్, టైర్ల తయారీ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $115 దాటడంతో ఈ కంపెనీల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు పతనంతో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారం వైపు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (Ounce) బంగారం ధర $2,200 లకు చేరింది.
₹ 250 Triliion Vapors : ఇక గ్యాస్ తంటాలు..

ఖతార్ లిక్విడ్ గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు $116 దాటింది. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను వణికిస్తున్నాయి.ఆహార సంక్షోభం: ఎరువుల (Urea) తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు 40% నుండి 60% వరకు పెరిగాయి, ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపుతోంది.
₹ 250 Triliion Vapors : ప్రపంచ దేశాల్లో అలజడి

ఖతార్ లో గ్యాస్ ఉత్పత్తికి బ్రేక్ పడటంతో.. ఇప్పటి వరకూ అమెరికా ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీని ఎంజాయ్ చేసిన ఐరోపా దేశాలు అవాక్కయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ సహా.. యుద్ధం నివారణ చర్చల్లో పాల్గొన్నాయి. ఐరోపా దేశాలు ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యాయి. ఇక భారత్ ప్రధాని .. గల్ఫ్ దేశాధినేతలు, ఇరాన్ అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపారు. యుద్ధం తో పరిష్కారం కాదని. వివించారు. ఇక చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు… యుద్ధం వద్దని వారిస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు పదే పదే తన హెచ్చరికలతో ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు ఈ దాడిని తమ సార్వభౌమాధికారంపై జరిగిన తీవ్రమైన దాడిగా ఖతార్ అభివర్ణించింది. ప్రతీకారంగా, ఖతార్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయానికి చెందిన సైనిక భద్రతా అధికారులను 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇరాన్ మళ్ళీ ఖతార్‌పై దాడులకు పాల్పడితే, ఇరాన్‌లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ ‘సౌత్ పార్స్’ (South Pars) ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. యుద్ధం నియంత్రణ తప్పుతోందని, వెంటనే దాడులు ఆపి చర్చలకు రావాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఖతార్‌కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ గ్యాస్ ధరలు 140% పెరిగాయి. 2023 తర్వాత అత్యధిక గ్యాస్ ఇప్పుడే పెరిగింది. యుద్ధానికి ముందు థర్మ్‌కు 71.13 పెన్స్ ($1.33)గా ఉన్న టోకు గ్యాస్ ధరలు, ఇప్పుడు థర్మ్‌కు 171.34 పెన్స్ ($2.29)కు పెరిగాయి.
