జనగామ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలను, కొత్త ఆశయాలను తీసుకువచ్చే పవిత్రమైన వేడుక. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నూతన సంవత్సర ఆరంభం ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపాలని, కుటుంబాల్లో ఐక్యత పెంపొందాలని, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ వృద్ధి, శాంతి, సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply