గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

  • వాహన తనిఖీల్లో 105.54 కేజీల గంజాయి స్వాధీనం
  • పట్టుబడిన గంజాయి విలువ రూ రూ 52,77,000
  • రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లు,
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్రమంగా రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ సందర్శించి,పట్టు బడిన గంజాయి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ మార్చి 18వ తేదీ సాయంత్రం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారంతో స్థానిక పోలీసులు,సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

అనుమానాస్పదంగా కనిపించిన టీఎస్ 11 ఈఆర్ 6312, టీఎస్ 07 జె వై 3959 నంబర్లు కలిగిన కార్లలో ముగ్గురు వ్యక్తులు వస్తుండగా వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు జరపగా 52 ప్యాకెట్లల్లో 105.54 క్వింటాలు గంజాయి ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.తనిఖీల్లో పట్టుబడిన గంజాయి విలువ రూ 52,77,000 ఉంటుందన్నారు.రెండు కార్లల్లోనీ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డొంకరాయి నుంచి నిషేధిత ఎండు గంజాయిని ప్యాకెట్ల రూపంలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు, ఖమ్మం, హైద్రాబాద్ మీదుగా షిర్డీకి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

గంజాయి అక్రమ రవాణాలో నల్లగొండ జిల్లా మర్రి గూడెం మండలం, ఎర్రగాళ్ల పల్లి గ్రామానికి చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్,నల్లగొండ జిల్లా,దేవరకొండ,ఖిల్లా బజారుకు చెందిన బైరిశెట్టి భార్గవ్,రంగారెడ్డి జిల్లా, వనస్థలిపురం,బిఎన్ రెడ్డి నగర్ కు చెందిన అంధేకర్ శ్రీనివాస్ తోపాటు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్నామన్నారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు అభి,లక్ష్మణ్,షారుక్ పరారీలో ఉన్నారని ఆదినారాయణ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025 జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 6844 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని,దీని విలువ రూ 34 కోట్ల ఏడు లక్షల రూపాయలు ఉంటుందన్నారు.పోలీసులు 86 గంజాయి కేసులను నమోదు చేశారని డీఎస్పీ వివరించారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన కొత్తగూడెం సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆదినారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ,ఎస్ఐ బాదావత్ రవి, ఏఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply