భారతాన్ని విశ్వగురుగా నిలపాలి..

భారతాన్ని విశ్వగురుగా నిలపాలి..

  • ఆర్ఎస్ఎస్ పాలమూరు జిల్లా సహకార్యవహ ప్రభాకర్

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ పాలమూరు జిల్లా సహకార్యవహ ప్రభాకర్, ముఖ్య అతిథులుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మాధవ ప్రాంగణంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ఈనెల 25న ఖండ కేంద్రంలో నిర్వహించే హిందూ సమ్మేళనానికి భారీ ఎత్తున తరలిరావాలన్నారు. వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమనిఅన్నారు.

గృహ సంపర్క పౌర నిర్మాణ నియమాలు బాధ్యతగల పౌరులుగా పాటిస్తూ దేశ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకుసాగాలన్నారు. విదేశీ నాగరికతను విడనాడి హిందూ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని ఉగాది పర్వదిన విశిష్టతను విరివిగా వివరించి ఉగాది పండగ రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగాకృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు కేశవరావు,పృథ్విరాజ్, బన్నెష్, రాజేష్ ,సాయి, శరణ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply