ఘనంగా కాషాయ ద్వజారోహణం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని మెయిన్ బజార్ హనుమాన్ మందిరం వద్ద శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని విహెచ్ పి ఆధ్వర్యంలో గురువారం కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్యాలయం ప్రారంభ వేడుకలు వైభవంగా చేపట్టారు.
ఈ సందర్భంగా విహెచ్పి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నా శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు యంగలిరాములు, విహెచ్పి అధ్యక్షులు వెంకటనారాయణ, మండల అధ్యక్షులు భీమ్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ రక్షణ కోసం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే వి హెచ్ పి లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఉగాది పర్వదినం నుండి ఏప్రిల్ 2 వరకు మండలంలో శ్రీరామోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, నాయకులు కేశవరావు, కర్ణాకర్, భరత్, గోపాల్ రెడ్డి, గొల్ల భాస్కర్, మోహన్ రెడ్డి, బసిరెడ్డి, రోషినప్ప,సుంగ్ పరివార్ కార్యకర్తలు బజరంగ్ దలు సంయోజకులు గోరక్ష సంయోజకులు తదితరులు పాల్గొన్నారు.
