Dhurandhar 2,Ustaad | పబ్లిక్ టాక్ ఇదే..

Dhurandhar 2,Ustaad | పబ్లిక్ టాక్ ఇదే..

Dhurandhar 2,Ustaad | ఉస్తాద్ భగత్ సింగ్ – పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రేక్షకుల అభిప్రాయం
కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యిందా?
ధురందర్ 2 – ఆడియన్స్‌ను కట్టిపడేసిన సినిమా
రణవీర్ సింగ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్?
ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాకి హైలైట్
బాక్సాఫీస్ వద్ద ఎవరి జోరు ఎక్కువ?
ఉస్తాద్ భగత్ సింగ్ vs ధురందర్ 2 – ఫైనల్ టాక్

Dhurandhar 2,Ustaad | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఉస్తాద్ భగత్ సింగ్, ధురందర్ 2.. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చాయి. ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుంచి వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే.. ధురందర్ బ్లాక్ బస్టర్ తర్వాత.. సీక్వెల్ గా వచ్చింది ధురందర్ 2. బాలీవుడ్ మూవీకి తెలుగులో ఎప్పుడూ లేనంతగా క్రేజ్ ఏర్పడింది. మరి.. ఉస్తాద్ భగత్ సింగ్, ధురందర్ 2.. ఈ రెండు చిత్రాల రియల్ టాక్ ఏంటి..?

Dhurandhar 2,Ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ ఇద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ రావడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. మళ్లీ ఈ క్రేజీ కాంబోలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. ఎట్టకేలకు అడ్డంకులు అన్నీ దాటుకుని ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే.. ఈ సినిమాలో పవర్ స్టార్ పర్ ఫార్మెన్స్ బాగుంది.. పాటలు బాగున్నాయి అని చెబుతున్నారు సినిమా చూసిన జనాలు. అయితే.. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం.. సినిమాకి మైనస్ అని టాక్ వచ్చింది. ముఖ్యంగా చాలా సీన్స్ చూస్తుంటే.. బోరింగ్ అనే ఫీలింగ్ కలిగిందనేది సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ టాక్.

Dhurandhar 2,Ustaad

ఇక ధురందర్ 2 విషయానికి వస్తే.. దాదాపు 4 గంటల సినిమా అయినప్పటికీ.. ఎక్కడా బోరింగ్ అనేది లేకుండా థియేటర్స్ లో ఆడియన్స్ ని కట్టిపడేసాడు అనే టాక్ వచ్చింది. ఇక హీరో రణవీర్ సింగ్ అయితే.. తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారని.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయని.. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ అయితే.. సినిమాకే హైలైట్ అని టాక్ వచ్చింది. ధురందర్ 2 అంచనాలను అందుకుంది.. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయే ఊహించడం కష్టం.. సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాల టాక్.

Dhurandhar 2,Ustaad

click here to read ఉస్తాద్ భగత్ సింగ్ మానియా..

click here to read more

Leave a Reply