ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో రాష్ట ప్రభుత్వం తరుపున నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ… పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు.
ఈ రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని, సౌబ్రాతృత్వాన్ని మెపెంపొదిస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమం కొరకు ప్రభుత్వం తోడ్పడుతుందని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర గారు ,వైస్ చైర్మన్ బాదం రమేష్ స్థానిక కౌన్సిలర్స్ నిజాం, నాయకులు హబ్బీబ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
