పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి..

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి..

సిర్పూర్ (యు ) ఆంధ్రప్రభ : పశు వైద్య శాల ఉద్యోగులు ఉచితంగా పశువులకు ఇస్తున్న గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని రైతులు తమ పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగా0 సర్పంచ్ సెడ్మకి జానే రావు కోరారు. బుధవారం మహాగంలో పశు వైద్య ఉద్యోగులు పశువులకు గాలికుంటు టీకా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు వెటర్నరీ అసిస్టెంట్ వర ప్రసాద్ గాలికుంటు టీకాలు వేశారు. ఈ శిబిరంలో 260 పశువులకు టీకాలు వేసినట్లు అయిన తెలిపారు. పశువులకు వేసవి కాలంలో గాలికుంటు వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్, వరప్రసాద్, పశు వైద్య సిబ్బంది మల్లేష్, బాపు, రైతులు పాల్గొన్నారు.