కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన…

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన…

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం భీంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందర నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా భీంగల్ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందర మోసపూరితమైన 420 హామీలు ఇచ్చి గద్దినెక్కిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరుచుకొని వెంటనే పెంచుతానన్న అన్ని రకాల పెన్షన్లను పెంచలని, అర్హులైన యువకులకు నిరుద్యోగ భృతి కల్పించాలని,రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, చదువుకుంటున్న విద్యార్థినిలకు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వాలని, కల్యాణలక్ష్మి పథకంలో ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కుప్కల్ గ్రామ సర్పంచ్ నర్సింగరావు, పురానిపేట ఉప సర్పంచ్ తోట హరికృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,ఉపాధ్యక్షులు ఈర్ల మహేందర్, కార్యదర్శి రజనీకాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, సీనియర్ నాయకులు కొట్టాల అశోక్, ధర్పల్లి మహిపాల్, దినేష్, హరిప్రసాద్, తోట రమేష్, చెప్పాల సునీల్, సుదర్శన్, హర్షవర్ధన్, నవీన్, భాగ్యరాజ్, ఆదిత్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.