రైతు సంక్షేమమే లక్ష్యం..

రైతు సంక్షేమమే లక్ష్యం..

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…
సబ్సిడీ పరికరాల పంపిణీ లో ఎఎంసీ చైర్మన్ కనకయ్య…

రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా రాయపోల్ మండల కేంద్రంలో ఎఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య ఆధ్వర్యంలో మంగళవారం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు రోటవేటర్, కల్టివేటర్, స్ట్రాబెలర్, పవర్ స్ప్రేయర్ తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను అందజేశారు.

ఈ పరికరాలు వ్యవసాయ పనులను వేగవంతం చేసి,ఖర్చులను తగ్గించడంతో పాటు దిగుబడులు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేస్తూ,సబ్సిడీ పథకాల ద్వారా ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్,ఏఈఓ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply