పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి..

పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి..

ఎఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో ఉన్న పరిశ్రమలలో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ అన్నారు. చౌటుప్పల్ లో నేడు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులు అనేక ఉద్యమాలు చేసిన పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, అనేకమంది డిగ్రీ, పీజీలు పూర్తి చేసి పట్టాలు చేతపట్టుకొని ఉద్యోగ అవకాశాలు రాక మనోవేదనకు గురవుతుంటే, స్థానికులు అనే సాకుతో తమ ప్రాంతంలో బోలెడు కంపెనీలు ఉన్న ఉద్యోగం కోసం బయట వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పంట పొలాలు, బూగర్భ జలాలు పూర్తిగా కలుషితం చేస్తున్నారని, రసాయన పరిశ్రమలు వ్యర్థలను యదేచ్చగా రోడ్లపై పారబోస్తున్న అధికారులు పట్టించుకోడంలేదని అన్నారు. ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఇక్కడ ఉన్న వాతావరనాన్ని నాశనం చేస్తా ఉంటే ఇక్కడి ప్రజలు ఊరుకోబోరని, తప్పకుండ భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, గుండెబోయిన భాస్కర్, ఉడుత రాజు, దాసరి సిద్దు, రాంచరణ్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply