కార్మికులు లేబర్ కార్డు సద్వినియోగంచేసుకోవాలి..

కార్మికులు లేబర్ కార్డు సద్వినియోగంచేసుకోవాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు సద్వినియోగంచేసుకోవాలని ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ జిల్లా ఫీల్డ్ అధికారి పవన్ రెడ్డిఅన్నారు. మంగళవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తుందనిఅన్నారు. కార్మికులు సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలనిఅన్నారు. కార్మికులకు లేబర్ కార్డు ద్వారా ప్రమాదమరణం రూ. 10 లక్షలు, సహజ మరణ సహాయం రూ. 2 లక్షలు,వైకల్య సహాయం 5 లక్షల వరకుపెళ్లి కానుక,ప్రసూతి సహాయం రూ. 30 వేలు తదితర సంక్షేమ పథకాలు మంజూరు చేయనట్లుతెలిపారు. ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సంతోష్ రెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply