ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం..

ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం..
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ఆంధ్రప్రభ, చిట్టీనగర్ : 46వ డివిజన్, చిట్టినగర్ లో ఉన్న కే ఎల్ రావు పార్క్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ని ప్రారంభించారు విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 17 లక్షల వ్యయంతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఓపెన్ థియేటర్ నిర్మించాలని అన్నారు. పునర్నిర్మాణం లో భాగంగా బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని, వాకింగ్ ట్రాక్‌తో కలిపి సుమారు 35, లక్షల రూపాయల వ్యయంతో తిరిగి అభివృద్ధి చేశారని అన్నారు.

ఆధునీకరణ పనులు ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రాంపులు వేయడం, లైనింగ్స్ మరియు మెట్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించారని అన్నారు. 2021 మార్చి 18న మేయర్‌గా బాధ్యతలు చేపట్టి, మార్చి 17, 2026 తన ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తపరుస్తూ, తన పదవీకాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించి, బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించినందుకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) ప్రభాకర్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
