Advisory | త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు…

Advisory | త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు…

Advisory | విజయవాడ, ఆంధ్రప్రభ : త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు అని పలువురు వక్తలు కొనియాడారు. విజయవాడ గురునానక్ కాలనీలోని పార్లమెంటరీ టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉడా మాజీ ఛైర్మన్ తూమాటి ప్రేమ్‌నాధ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఏపీ బిల్డింగ్ అధర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ బోర్డు కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, నగర పాలక సంస్థ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాధం, కామా దేవరాజ్, టీ ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, టిడిపి జిల్లా కార్యదర్శి పిళ్లా శ్రీనివాస్ , సీనియర్ నాయకులు వి.నర్సింహాచౌదరి తదితరులు ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పించారు.

Advisory |

ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ…నిజమైన త్యాగనిరతికి ప్రతి రూపం పొట్టి శ్రీరాములు అని, 1952లో భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాటి ప్రభుత్వం పై పోరాటం చేసి 58 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి తన ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా త్యజించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఘన మైన నివాళి అర్పిస్తోందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 58 అడుగుల ఎత్తు గల పొట్టి శ్రీరాములు కాంశ్య విగ్రహంను ఆవిష్కరించి అమరజీవికి ఘన కీర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందించి చరిత్ర సృష్టించిందన్నారు.

Advisory |

ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు సోలంకి రాజు, మైనార్టీ సెల్ నాయకులు అబీబ్ హుస్సేన్, బిసీ నాయకులు పట్నాల హరిబాబు, రాష్ట్ర ఆర్యకటిక బిసి సాధికారిక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ భక్తవత్సలం, టీడీపీ నాయకులు చంద్రశేఖర్, మాధవ్, ఎ దుర్గాప్రసాద్, కె వి నరసింహారావు, ఉప్పులూరి శివాజీ, మహిళా నాయకులు శానంపూడి వెంకటలక్ష్మీ, వీరమాచినేని అరుణ తదితరులు పాల్గొన్నారు.