అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్,ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణం లోని వలిగొండ రోడ్డులో గల శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఆదివారం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాతం, గణపతి పూజ, ఎదుర్కోళ్ళు, ఉదయం 11-30 ని లకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి 8గంటలకు, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు – సంధ్య దంపతులు, వైస్ చైర్మన్ గోశిక వినయ్, దేవస్థానం అధ్యక్షులు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, ఊదరి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి ఊదరి శంకర్, కోశాధికారి ఎలకరాజు నాగరాజు (మల్లేష్), ఉష్కాగుల శ్రీనివాస్, తూర్పునూరి నరసింహ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, తొర్పునూరి మల్లేష్ గౌడ్, గట్టు పవన్, నకిరేకంటి శ్రీశైలం, ఉదరి మారయ్య ఉదరి యాదయ్య, చెవగొని మహేష్, జక్కర్తి శేఖర్, నల్ల పర్వతాలు, ఉయ్యాల పల్లవి, గంగిరెడ్డి నాగలక్ష్మి, బత్తుల శ్రీశైలం గౌడ్, మంచికంటి భాస్కర్, గుజ్జల సురేందర్ రెడ్డి, అన్నెమోని గోవిందరాజు, ధర్మకర్తల మండలి బత్తుల విప్లవ గౌడ్, కాసుల వెంకటేష్, బాల్యం వెంకటాచలపతి, నల్ల గణేష్, ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

