గిరిజన వ్యక్తిపై ఎలుగుబంటు దాడి..

గిరిజన వ్యక్తిపై ఎలుగుబంటు దాడి..

తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోఇటీవల కాలంలో వన్యప్రాణులు, క్రూర మృగాలు అటవీ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాలకు వస్తున్నాయి. నంద్యాల జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతం సమీపంలో కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచుగూడెం నివాసి పెద్ద అంకన్న ఆదివారం ఉదయం కట్టెల కోసం అడవిలోకి వెళ్లాడు. కొద్ది దూరం పోయేసరికి నిమ్మల పెద్ద అంకన్న పై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటిని కట్టెతో కొట్టినప్పటికీ అది అంకన్న పై దాడి చేయటంతో అంకన్న తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడిన పెద్ద అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అంకన్నకు మెరుగైన చికిత్స ను అందిస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్న రు. అటవీ ప్రాంత సమీపంలో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారం ఉందని అటువైద్య అధికారులకు తెలిపిన పట్టించుకోవటం లేదని ఆ గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేయటం విశేషం. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి నీ గ్రామాల పరిసరాలు కి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సదరం పెంట చెంచుగూడెం గిరిజనులు కోరుతున్నారు.

Leave a Reply