మానవతా విలువలు పెంపొందించుకోవాలి

మానవతా విలువలు పెంపొందించుకోవాలి
నబీ సేవలు అభినందనీయం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్,ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరు తమ జీవితంలో మానవతా విలువలు పెంపొందించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శనివారం మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎం డి నబీ రంజాన్ పర్వదినం పురస్కరించుకుని నూతన పాలకవర్గం, మాజీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు లకు సన్మానం,ముస్లిం సోదరులు, వర్కర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు
. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ.. వెటర్నరీ శాఖ లో రిటైర్డ్ అయిన నబీ సేవలు అభినందనీయమన్నారు.తన జీవితం లో ఆత్మీయ మిత్రలు,ప్రజాప్రతినిధులతో పాటు తన వద్ద పనిచేసిన వర్కర్లకు దుస్తులు పెట్టడం మంచి ఆనవాయితీ అన్నారు. నబీ మానవత్వం చాటుకోవడం పట్ల అభినందించారు. ప్రతి ఒక్కరు తమ సంపాదనలో కొంతమేరకు పేదలకు ఖర్చు చేయడం మనవతవాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రంజాన్ దుస్తులు పంపిణీ,ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు.
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి,మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న,కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గుండగొని రామచంద్రు,జంగ శ్రీను,మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటయ్య,సీనియర్ జర్నలిస్టు కాయితాల నర్సిరెడ్డి,కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న,ప్రమీల,శ్రీవిద్య, శైలజ,రమణ,స్వామి,మధు,శోభ,అనురాధ,మాజీ కౌన్సిలర్లు శిరీష,సుజాత,నాయకులు చెడే చంద్రయ్య, బొల్లు యాదగిరి, పొన్నెబొయిన రమేష్, యాకుబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
